నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఏప్రిల్ 8, బుధవారం భైంసా పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు క్యాంప్ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలపై స్పందించనున్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలు, పోలీసు సంబంధిత ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకురావచ్చు.