ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం నవంబర్ 15వ తేదీన కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు లతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాజీపడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.