నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ఫారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆయన ప్రజలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.