పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ

4చూసినవారు
పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ
ధర్పల్లి మండలం 12వ వార్డులో పవర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ పరిశీలించారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, ఫారాల స్వీకరణ ప్రక్రియను సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి తప్పులు లేకుండా ఫారాలు స్వీకరించి, పారదర్శకంగా నమోదు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు సభ్యురాలు పిండి మమతా రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్