ధర్పల్లి మండలంలోని సన్షైన్ స్కూల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్కూల్లో వినాయకుని ప్రతిష్టాపించుకొని నియమనిష్టలతో పూజలు నిర్వహించి తొమ్మిది రోజులకు నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఇంజాపురం మహేందర్, గంగరాజుల సుమలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.