క్రీడా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్థాయి. మేయర్ ఉమారాణి

15చూసినవారు
క్రీడా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్థాయి. మేయర్ ఉమారాణి
నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమాదేవి టైక్వాండో క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు తమ నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకురావాలని కోరారు. నగరంలోని టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని మేయర్ ఉమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ పవర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వహజ్ అలీ ఖాన్, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :