నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు*

13చూసినవారు
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు*
ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని ఆయన హితవు పలికారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో పాటు ఎరువులు విత్తనాల డీలర్లతో, రైస్ మిల్లర్లతో కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్