దారి దోపిడీకి పాల్పడ్డ నిందితుల అరెస్టు

4చూసినవారు
దారి దోపిడీకి పాల్పడ్డ నిందితుల అరెస్టు
జిల్లాకేంద్రంలో బ్యాంక్ డబ్బులు జమచేయడానికి వెళ్తున్న బంగారు వర్తకుడి సహాయకుడి వద్ద నుంచి రూ. 19.20 లక్షలు కారులో వచ్చి దోచుకున్న ముగ్గురు నిందితులను 3వ టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నాందేవ్వడ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన వినోద్ శంకర్ పవార్, అమర్ దా మోదర్ చర్వాద్, నౌషద్ ఖాదర్ సయ్యద్‌లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 1.50 లక్షల నగదు, 3 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్