వాడి గ్రామంలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన తాసిల్దార్

0చూసినవారు
వాడి గ్రామంలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన తాసిల్దార్
ధర్పల్లి మండలం లోని వాడి గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని తాహసీల్దార్ టి. శాంత పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, వివరాల సవరణ, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులు, బీఎల్‌ఓలకు అవసరమైన సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫారాలను స్వీకరించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు నమోదు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు వంటి సేవలను పూర్తి చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్