తెలంగాణ విశ్వవిద్యాలయం ఎం.ఈడి విద్యార్థుల డిసర్టేషన్ వైవా-ఓస్ పూర్తి

1చూసినవారు
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎం.ఈడి విద్యార్థుల డిసర్టేషన్ వైవా-ఓస్ పూర్తి
నిజామాబాద్ అర్బన్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగాపూర్ విద్య కళాశాల యందు 2024-2026 బ్యాచ్ ఎం.ఈడి. విద్యార్థుల డిసర్టేషన్ వైవా-ఓస్ శుక్రవారం విజయవంతంగా నిర్వహించబడింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు తమ ప్రాజెక్ట్ రిపోర్టులను డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ డాక్టర్ పడాల లక్ష్మణ్ సమక్షంలో సమర్పించి, వైవా-ఓసును పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నల్ ఎగ్జామినర్లుగా డాక్టర్ ఆర్ కరుణాకర్, డాక్టర్ వి శ్రీనివాస్, డాక్టర్ ఏ సువర్చల, డాక్టర్ ఎస్. రవీందర్, పోలపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కాన్వకేషన్ డ్రెస్ లతో సందడి చేశారు. ఈ వైవా-ఓస్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

సంబంధిత పోస్ట్