పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు వెంటనే అందించాలి.. టీజీవీపీ

1చూసినవారు
పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు వెంటనే అందించాలి.. టీజీవీపీ
నిజామాబాద్ జిల్లాలో 4 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, మరియు బ్యాగులు అందించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కల్యాణ్ రామ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్  త్రిపాఠి ఐఏఎస్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇంకో 4 రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి కానీ ఇంకా పాఠ్యపుస్తకాలు రాలేదు, నోట్ పుస్తకాలు 50% అందుబాటులో ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన వీటిని అందించాలి అని అన్నారు.