నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ, మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవితంలో ఎంతో కీలకమని అన్నారు. నగరంలోని లక్ష్మిగణపతి రోడ్లోని మెకానిక్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, మెకానిక్లకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన హెల్త్ క్యాంపులు, జీవిత బీమా, ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన చికిత్స అందించేందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.