నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ బీ. రఘుపతి ఆధ్వర్యంలో ఇస్లాంపూర, ఖోజా కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, సెక్యూరిటీ కల్పించడం కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరూ సహకరించాలని ఏసీపీ ప్రకాష్ కోరారు. ఈ కార్యక్రమంలో 70 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.