ప్రజల మధ్యలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేతీరునుఅరవింద్మానుకోవాలి

1చూసినవారు
ప్రజల మధ్యలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేతీరునుఅరవింద్మానుకోవాలి
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ నిజామాబాద్ లో మాట్లాడుతూ, స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ అభివృద్ధి చెందకపోవడానికి 'నిజం సర్కార్' కారణమని, నిజం సాగర్ లో నీళ్లు లేవని, షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని అరవింద్ అన్న తీరును రాంభూపాల్ విమర్శించారు. గత పాలనపై విమర్శల కంటే నిజామాబాద్ అభివృద్ధిపై మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అరవింద్ తన లెటర్ ప్యాడ్, విజిటింగ్ కార్డులపై 'నిజామాబాద్' అని ముద్రించుకుంటూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పేరును 'ఇందూరు' అని చెబుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాంభూపాల్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్