నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 60 డివిజన్లలో బీజేపీ నుంచి పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేయడంతో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా కోర్ కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆశావహుల దరఖాస్తులను పరిశీలించి, గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ 40 డివిజన్లలోనే బీజేపీ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించింది.