నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే కాకుండా, జనసంచారం తక్కువగా ఉన్న వీధులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని దుండగుడు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి కలకలం సృష్టించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 11:30 నుంచి 12 గంటల మధ్య) పద్మానగర్ రోడ్ నంబరు 2, 3 పరిధిలోని ఇళ్లలోకి చొరబడిన దుండగుడు, మొదటగా తల్లి, కూతురి ఇంట్లోకి ప్రవేశించి 3 గ్రాముల బంగారు నగలు, రూ. 10 వేల నగదును అపహరించాడు.