నిజామాబాద్: గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

64చూసినవారు
నిజామాబాద్: గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
డిప్యూటీ కమీషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్ అధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి, ఎల్లమ్మకుంట, అసద్ బాలానగర్ ప్రాంతములలో ఎండు గంజాయి విక్రేతలపై విస్త్రృతమైన దాడులు నిర్వహించి 1. 435 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజయా బేగంలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు రాజు, నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, షమీన్, శివ, సాయి, విష్ణు, అవినాష్ట మంజుల, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్