ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ లో మట్కా అడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ వో సత్యనారాయణ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి పెర్కిట్ కు చెందిన మహమ్మద్ ఎజాస్, షేక్ ఆబిద్, మహమ్మద్ జాకీర్ హుస్సేన్ లు మహారాష్ట్రకు చెందిన గోల్ అనే వ్యక్తితో ఆన్ లైన్ లో మట్కా ఆడుతూ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 6 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.