నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి ప్రాంతంలో రోడ్డుపై అక్రమంగా ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న షాపులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో తొలగించారు. జిల్లా సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. రోడ్లను ఆక్రమించి షాపులు ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.