నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నరేష్ మానవత్వం చాటుకున్నాడు. నగరంలోని వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 19 రోజుల చిన్నారికి ఏబీ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ నరేష్‌కు ఈ విషయం తెలియగానే వెంటనే స్పందించి, ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో అత్యవసర స్థితిలో ఉన్న చిన్నారి ప్రాణాలు నిలిచాయి. శిశువు తల్లిదండ్రులు కానిస్టేబుల్ నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.