ధర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు

1చూసినవారు
ధర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు
ధర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్‌తో పాటు రజక కుల సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్