నిజామాబాద్: ఆవు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం

77చూసినవారు
నిజామాబాద్: ఆవు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం
నిజామాబాద్ నగరంలోని ఆకుల పాపయ్య రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దుండగులు ఉదయం 3. 30 గంటల ప్రాంతంలో ఓ ఆవుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారులో తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేశారు. వెంటనే ఆవును వదిలి కారులో పరారైనట్లు తెలిపారు. అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్