నిజామాబాద్ లోని మారుతీనగర్ కు చెందిన శంకర్ ప్రసాద్ ఈ నెల 7న ఖలీల్ వాడిలోని ఓ ఆస్పత్రి ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీకి గురైందని ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. సోమవారం బోధన్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పట్టుకొని విచారించగా కోటగిరి మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన తాటిగొల్ల గోపాల్, వెంగర్రావు నగర్ కు చెందిన అర్భాజ్ అలియాస్ జాఫర్ బైక్ దొంగత నాలు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు.