దమ్మన్నపేట్ లో ZPHS విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

472చూసినవారు
దమ్మన్నపేట్ లో ZPHS విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ
ధర్పల్లి మండల కేంద్రంలోని దమ్మన్నపేట గ్రామంలో MPPS దమ్మన్నపేట్ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన స్కూల్ యూనిఫాంను గ్రామ సర్పంచ్ దంపతులు తలారి వసంత రమేష్, ఉప సర్పంచ్ గూండ్ల శ్రీనివాస్, సెక్రటరీ శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్, దినిజ అందజేశారు. విద్యార్థుల సంక్షేమ సౌకర్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, యువకులు, గ్రామ ప్రజలు, నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్