ఇందూర్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన అధికారులు, ఎన్నికల హామీ మేరకు బయో-మైనింగ్ ద్వారా చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించే పనులు వేగవంతం చేశారు. 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. చెత్తపై ద్రావణం పిచికారీ చేసి, ట్రమ్మెల్ యంత్రంతో ఎరువు, నిర్మాణ సామగ్రి, RDFగా వేరుచేస్తారు. ప్రస్తుతం రెండు మిషన్లు పనిచేస్తుండగా, మరికొన్ని త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఈ చర్యలతో నాగారం ప్రాంతం శుభ్రపడి, డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.