ఆస్తిపన్నుపై ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సద్వినియోగం చేసుకున్నారు. ఆయన 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును గురువారం రాత్రి ముందస్తుగా చెల్లించారు. ఇంటి పన్నుతో పాటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్ను మొత్తం రూ. 11.75 లక్షలు చెల్లించారు. మున్సిపల్ శాఖ కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.