కలెక్టరేట్ లో ఘనంగా వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి*

1చూసినవారు
కలెక్టరేట్ లో ఘనంగా వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి*
వైశాఖ శుక్ల పక్ష దశమి సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాల వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.