అర్హులైన వికలాంగులకు వాహనాలు ఇవ్వాలి

0చూసినవారు
అర్హులైన వికలాంగులకు వాహనాలు ఇవ్వాలి
అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహిళ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం వికలాంగులకు ప్రత్యేక వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ వాహనాలకు మోక్షం కలిగిందని, దరఖాస్తు చేసుకున్న అందరికీ వాహనాలు అందేలా చొరవ చూసుకోవాలని పేర్కొన్నారు. తాను సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ను కలిసి లేఖను అందజేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్