కమాండ్ కంట్రోల్ హాలులోని సీసీ కెమెరాల ద్వారా వీక్షణ

నిజామాబాద్‌లో జరుగుతున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పర్యవేక్షించారు. బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా విక్షించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
