రెండున గ్రామ, వార్డు సభలు

2చూసినవారు
రెండున గ్రామ, వార్డు సభలు
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 02వ తేదీన గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీలలో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులకు పలు అంశాలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్