ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సభల నిర్వహణలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు.