జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త సంక్షేమ పథకాల గురించి వివరించాలని, ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ, వార్డు సభలను అట్టహాసంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సాయంత్రం ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ సభలు నిర్వహించబడతాయి.