హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని, రేవంత్ రెడ్డి కూడా హిందూమతంలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక మతం కోసం పని చేస్తూ, ఇతర మతాలను కించపర్చడం అలవాటైందని ఆరోపించారు.