నిజామాబాద్ జిల్లాను క్రీడా జిల్లాగా మారుస్తానని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం డీఎస్ఏ మైదానంలో సుబ్బారావు స్మారక క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన, జిల్లాలో ఏటా పెద్దఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. బొమ్మ ఎడుకేషనల్ ట్రస్ట్ పోటీల ఖర్చు భరిస్తుందని, డీఎస్ఏ మైదానాన్ని తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియం నిర్మాణం ఫైనాన్స్ క్లియరెన్స్లో ఉన్నాయని, ఆర్థిక మంత్రి అనుమతితో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారుడని, అందుకే మెస్సీని హైదరాబాద్కు తీసుకువస్తున్నారని చెప్పారు.