నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా వారికి బట్టలు, సబ్బులు, నూనెలు, ఇతర భద్రతా పరికరాలను కూడా అందించాలని కోరారు. గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులకు చెల్లింపులు జరపాలని తెలిపారు.