నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు

5చూసినవారు
నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలో గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. చైనా మాంజా వలన ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే, వారిపై హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్