నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య

567చూసినవారు
నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య
మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన సారంగాపూర్ ఆరో టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. సారంగాపూర్ లోని వడ్డెర కాలనీలో దుబ్బాక సాయమ్మ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు ఉండగా.. ముగ్గురికి వివాహం జరిగింది. కుమారుడు దుబాయ్ కి వెళ్లాడు. సాయమ్మ భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే గురువారం రాత్రి దుండగులు ఆమెను ఇంట్లోనే హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్