తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ప్రజావాణిలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ కార్మికులకు రెండు షిఫ్టుల విధానాన్ని రద్దుచేసి, గతంలో లాగే ఒకే విడతలో విధులు కేటాయించాలని, ఔట్సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్, సబ్బు నూనెలు, రక్షణ పరికరాలు అందించాలని వారు కోరారు.