
ఓడిపోయిన అభ్యర్థి ఇంటిని ట్రాక్టరుతో ఢీకొట్టిన సర్పంచి సోదరుడు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేటలో ఎన్నికల్లో ఓడిపోయిన భారాస అభ్యర్థి బిట్ల బాలరాజును పరామర్శించడానికి వెళ్లిన వారిపై, గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కుర్మ పాపయ్య సోదరుడు కుర్మ చిరంజీవి ట్రాక్టర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ట్రాక్టర్ టైర్ల కింద ఇరుక్కుపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై భారాస నాయకులు ఆందోళన చేపట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా బాధ్యులను శిక్షిస్తామని వీడియో విడుదల చేశారు.





































