కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో పసుల శ్రీనివాస్ (35) వడదెబ్బతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. కూలి పని చేసుకునే శ్రీనివాస్ ఎండ దెబ్బ తగలడంతో ఇంటికి చేరుకొని ఆకస్మికంగా మరణించినట్లు మృతుని అన్న పసుల సాయిలు తెలిపారు. బుధవారం జరిగిన అంత్యక్రియలకు హాజరైన మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, స్థానిక సర్పంచ్ గైన శ్రీనివాస్, బారాస గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషన్ రావు, ఉప సర్పంచ్ దాని రాజయ్యలు మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.