కామారెడ్డి మండలం నర్సంపల్లి గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించిన సహాయం, ఎదురైన ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు వున్నారు.