నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన నూతన గోడగడియారాలను గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధారమైన సాయిబాబా, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, జిపి సెక్రెటరీ వెంకట్, రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశం,
కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి కుతుబుద్దీన్, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.