ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం నుంచి వర్షం దంచికొడుతోంది. రాత్రి 12. 30 గంటలకు ప్రారంభమైన వర్షం 1. 30 గంటల వరకు కురిసింది. తిరిగి ఉదయం 8 గంటల సమయంలో వర్షం ప్రారంభమై కొనసాగుతోంది. దీంతో పట్టణంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది.