కామారెడ్డి: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె

9చూసినవారు
కామారెడ్డి: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
తండ్రి చితికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్ భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లా కేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో అన్నీ తానై పెద్ద కూతురు దేవిజ్ఞ తండ్రికి అంత్యక్రియలు చేసింది.

సంబంధిత పోస్ట్