ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.