అనారోగ్యంతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

589చూసినవారు
అనారోగ్యంతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన ఊట్ల ప్రసాద్ (35) వెన్నునొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన భార్యకు చర్చిలో పడుకుంటానని చెప్పి వెళ్లి, రాత్రి 11:30 గంటలకు కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో చనిపోతున్నానని మెసేజ్ పెట్టి, పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్