కామారెడ్డి - నిజామాబాద్ సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్ఫు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. తాడ్వాయి మండలం దేమీకాలాన్ గ్రామానికి చెందిన అంబిర్ గూబదేరావు (50) అనే రైతు నిజామాబాద్ నుండి కామారెడ్డికి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి వెళ్లిందని పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రున్ని అంబులెన్సు లో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గూబదేరావు కాలు విరిగిందని తెలిపారు.