ఉరి వేసుకుని వివాహిత మృతి

1206చూసినవారు
ఉరి వేసుకుని వివాహిత మృతి
ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో శుక్రవారం సతాల లావణ్య (27) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. భర్త రమేష్ పట్టణానికి వెళ్లి తిరిగి వచ్చి చూడగా, లావణ్య ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.