కామారెడ్డి పట్టణ
బీజేపీ అధ్యక్షుడిగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు
బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ప్రకటించారు. ఈ సందర్భంగా మోటూరి శ్రీకాంత్ కు నియామకం పత్రాన్ని గురువారం అందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పలువురు శ్రీకాంత్ ను సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తాను అని శ్రీకాంత్ అన్నారు.