ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జిల్లాకు 1, 300 ఎకరాల లక్ష్యం నిర్దేశించగ, ఇప్పటికే 1, 000 ఎకరాలకు రైతులను గుర్తించినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శుక్రవారం తాడ్వాయి మండలం దేమికలాన్లో రైతు రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 8 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు. జిల్లాలో 2022–23 సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభమైందన్నారు.